26.5 C
Hyderabad
Saturday, February 28, 2026
spot_img

నారాయణపేట: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం

స్వతంత్ర వెబ్ డెస్క్: నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని గుడిగండ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలానికి చెందిన భాషా (50), షికూర్ (50), వెంకట్రావు గా గుర్తించారు. ముగ్గురు కలిసి కారులో గోవా వెళ్లారు. తిరిగి వస్తుండగా మక్తల్ మండలం, గుడిగండ్ల గ్రామ సమీపంలో హైదరాబాద్ వైపు వెళుతున్న లారీని ఓవర్టేక్ చేయబోయి వెనుక భాగంలో ఢీ కొట్టి వెనుక భాగంలో ఇరుక్కుపోయింది.

ఈ విషయము గమనించని లారీ డ్రైవర్ లారీని అర కిలోమీటర్లు పైగా ప్రమాదానికి గురైన కారుతో పాటు లారీ వెళుతుండడం చూసిన కొంతమంది లారీని ఓవర్టేక్ చేసి విషయాన్ని డ్రైవర్ కు చెప్పారు. లారీని పక్కకు ఆపి ప్రమాదం జరిగిన విషయాన్ని గుర్తించిన లారీ డ్రైవర్ భయంతో పరారయ్యాడు.

విషయం పోలీసులకు తెలియడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఇద్దరు మృతి చెంది ఉండగా, వెంకట్రావు తీవ్రంగా గాయపడగా.. డ్రైవర్ ప్రశాంత్ కు సీటు బెల్టు ఉండడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. తీవ్రంగా గాయపడిన వెంకట్రావును మహబూబ్ నగర్ జిల్లా దవాఖానకు తరలించారు.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్