స్వతంత్ర వెబ్ డెస్క్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అధికారుల సోదాలకి భయపడిన ఓ ఉన్నతాధికారి పెద్దమొత్తంలో నోట్ల కట్టలను బాక్సుల్లో పెట్టి పక్కింటిపై విసిరేసిన ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నబరంగ్‌పుర్ జిల్లా అదనపు సబ్ కలెక్టర్ ప్రశాంతకుమార్ రౌత్‌పై ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో విజిలెన్స్ అధికారులు తెల్లవారుజామునే రంగంలోకి దిగారు. భువనేశ్వర్‌లోని ఆయన ఇంట్లో సోదాలు మొదలుపెట్టారు. దీంతో ఆయన.. ఆరు బాక్సుల్లో నగదు నింపి, పక్కింటి టెర్రస్‌పై విసిరేశారు. ఇది గుర్తించిన అధికారులు ఆ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. ‘ఆ అధికారి ఇటీవల రూ.2000 నోట్లను రూ.500 నోట్ల కింద మార్పిడి చేయించారు. వాటిని దాచి పెట్టిన ఆరు బాక్సులను సీజ్ చేశాం. ఇక్కడ రూ.2.25 కోట్ల నగదు పట్టుబడింది’ అని ఓ సీనియర్ విజిలెన్స్ అధికారి వెల్లడించారు. మరో తొమ్మిది ప్రాంతాల్లోనూ ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఈ క్రమంలోనే నబరంగ్‌పుర్‌లోనూ మరో రూ.77 లక్షలు పట్టుబడ్డాయి. మొత్తంగా రూ.3 కోట్లకు పైగా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో మైనింగ్ మాఫియాకు సహకరిస్తూ రౌత్ పెద్దమొత్తంలో అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2018లో సుందర్‌గఢ్ జిల్లాలో బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా ఉన్న సమయంలో లంచం కేసులో ఒకసారి అరెస్ట్ అయ్యారు.
విజిలెన్స్ దాడుల భయంతో పక్కింటి టెర్రస్ పై రూ.2 కోట్లు విసిరిన ఉన్నతాధికారి..
Latest Articles
- Advertisement -