తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి గోల్డెన్ వీసా అందు కున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ సూపర్ స్టార్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూఏఈ ప్రభుత్వానికి రజనీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. యూఏఈ గోల్డెన్ వీసా పొందడం గౌరవంగా భావిస్తున్నట్లు రజనీకాంత్ చెప్పారు. పెట్టుబడి దారులు, వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, నటులు, సాహిత్యం, కల్చర్, అసాధారణ ప్రతిభ కలిగిన గ్రాడ్యుయే టర్లు.. ఇలా వివిధ రంగాలకు చెందిన వారికి 10 ఏళ్ల కాలపరిమితితో యూఏఈ ఈ ప్రత్యేక వీసాలను అందిస్తోంది. ఈ వీసా పొందిన వారు ఎలాంటి ఆంక్షలు లేకుండా యూఏఈలో దీర్ఘకాలికంగా నివసించే వీలు ఉంటుంది. 2019 నుంచి ఈ గోల్డెన్ వీసాలు మంజూరు చేయడం మొదలైంది.
యూఏఈ ప్రభుత్వం జారీ చేసే ఈ గోల్డెన్ వీసాను భారత్ నుంచి సినీ ప్రముఖుల్లో మొదటగా షారుఖ్‌ఖాన్ అందుకు న్నాడు. ఆ తర్వాత బాలీవుడ్ నటులు సంజయ్ దత్, సునీల్ శెట్టి, మౌనీ రాయ్, ఫరా ఖాన్, బోనీ కపూర్ ఫ్యామిలీ, నేహా కక్కర్, సింగర్ సోనూ నిగమ్ ఈ వీసాను పొందారు. మలయాళ ఇండస్ట్రీ విషయానికొస్తే మోహన్ లాల్, మమ్ముట్టి, టోవినో థామస్, దుల్కర్ సల్మాన్ ఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. ఈ వీసాను అందుకున్న తొలి తమిళ కథానాయిక గా త్రిష రికార్డుకెక్కింది. ఆమె తర్వాత అమలాపాల్ ఈ వీసాను పొందింది. ఇక టాలీవుడ్ సినీ ప్రముఖుల్లో ఈ వీసా అందుకున్న మొదటి వ్యక్తిగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ భార్య ఉపాసన నిలిచారు. ఆ తర్వాత అల్లు అర్జున్‌కు కూడా ఈ వీసా వరించింది. హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా యూఏఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా అందుకున్నారు.


