తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్‌లలో కుప్పలు తెప్పలుగా పడిఉన్న కేసులను విచారించేందుకు రెడీ అవు తోంది. ఈ సందర్భంగా ప్రధాన కేసుల్లో ఏళ్ల నుంచి అధికారుల కన్నుగప్పి తప్పించుకు తిరుగుతున్న క్రిమినల్స్‌పై మరింత దృష్టి సారించారు. ఇందుకోసం ఇందుకోసం ఎస్పీలు, కమిషనర్లతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది.
తెలంగాణలో కుప్పలు తెప్పలుగా పడి ఉన్న పెండింగ్ కేసులపై ఫోకస్ పెట్టారు డీజీపీ రవిగుప్తా. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెండింగ్ కేసులను సత్వరమే విచారణ చేపట్టి నిందిలుగా ఉన్న వారికి వారంట్లను క్లియర్ చేయాలని జిల్లాల ఎస్పీలు, కమీషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే కేసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న నిందితులను అదుపులోకి తీసుకోవాలని, ఇందుకోసం ప్రతీ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ధీర్ఘాకాలికం గా వివాదాస్పదంగా ఉన్న కేసుల పురోగతి కోసం.. తిరిగి మొదటి నుంచి దర్యాప్తు చేపట్టాలన్నారు. చిన్న చిన్న కేసులను లోక్ ఆధాలాత్‌లో పరిష్కరించుకునేలా ఇరువర్గాలకు కౌన్సిలింగ్ ఇవ్వాలని.. ఒకవేళ ఇద్దరిలో ఒకరు అంగీకరించని పక్షంలో ఇలాంటి కేసులని వదిలేయాలని సూచించారు DGP రవిగుప్తా. ఇక డీజీపీ ఆదేశాల మేరకు పెండింగ్ కేసుల పై ప్రతి వారం రివ్యూ నిర్వహిస్తున్నారు జిల్లా ఎస్పీలు. అలాగే పాత కేసులు వారెంట్‌లపై DGPకి నీవేదిక సమర్పించ నున్నారు. ఇందుకోసం SP ఆఫీస్‌లో ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేసి… పీఎస్‌లలో పేరుకుపోయిన కేసులలో అలస త్వంగా వ్యవహరించిన పోలీస్ స్టేషన్ల SHOలపై చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో గ్రామాల్లో అధిప త్య పోరు కారణంగా నమోదైన కేసుల్లో తీవ్రతను గుర్తించి వాటిని వెంటనే పరిష్కారం అయ్యేలా చర్యలు చేపడుతున్నా రు పోలీసులు.
ఇక కేసుల వివరాలు ఓసారి పరిశీలిస్తే రాష్ట్రంలో ప్రతి ఏడాది లక్షన్నరకుపైగా కేసులు నమోదవుతుండగా వాటిలో ఐదు శాతం పెండింగ్ కేసులుగా నమోదు అవుతున్నాయి. ఇందుకు SHOల నిర్లక్ష్యమే కారణం గా తెలుస్తోంది. సైబర్ CID, CCSలలో పెండింగ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రధానంగా సైబర్ నేరాలలో నిందితులను పట్టుకోవడం కష్టంగా మారుతొందని, వివిధ రాష్ట్రాల్లో, దేశాలలో ఉండడమే ఇందుకు కారణమని పోలీసులు చెబుతున్నారు. ఇక ఇటీవల కాలంలో వేలాది కేసులు సైబర్ క్రైమ్ స్టేషన్‌లలో పెండింగ్‌లో ఉన్నట్టు గుర్తించిన ఉన్నతాధికారులు కేసుల పరిష్కారంపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మరోపక్క ప్రతి సంవత్సరం పోలీసులు విడుదల చేసే యాన్యువల్ రిపోర్ట్‌ను బట్టి గత 24 సంవ త్సరాలుగా రాష్ట్ర పోలీసు శాఖలో పెండింగ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్టు తెలు స్తోంది. 2023 వరకు చూసుకుంటే ఈ సంఖ్య దాదాపు 50 వేలకు చేరుకుంది. ఇకపోతే హైదరాబాద్‌లో ఎస్‌ఓటీ టాస్స్‌ఫోర్స్ పోలీసులు చేధించిన కేసులను ఆయా పోలీస్‌స్టేషన్‌లలో పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రతీ పీఎస్‌లో పెండింగ్ కేసుల సంఖ్య అధికంగా ఉంటే, దానికి బాధ్యులుగా SHOలపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు ఉన్నతాధికారులు. అంతేకాదు, జీరె పెండింగ్ కేసులు రిపోర్ట్ అయితే కనుకు ఆ పీఎస్ సిబ్బందికి రివార్డులు ఇచ్చేందుకు ప్రణాళికుల రూపొందిస్తున్నారు. ఇలా మొత్తానికి పోలీస్ యంత్రాంగమంతా పెండింగ్ కేసులపై దృష్టి సారించింది. కొత్త కేసులతోపాటు పాత కేసుల పరిష్కారం దిశగా ఇక నుంచి ప్రతి వారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్‌లలో పెండింగ్ కేసుల మేళా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.