ఢిల్లీ మెట్రోలో ఓ యువకుడు బరితెగించాడు. చుట్టూ ప్రయాణికులు ఉన్నారన్న కనీస జ్ఞానం కూడా లేకుండా పాడు పనికి పాల్పడ్డాడు. సిగ్గు, ఎగ్గూ వదిలేసి చేతులకు పనిచెప్పాడు. తన ఫోనులో బూతు వీడియోలు చూస్తూ ఏకంగా హస్తప్రయోగం చేశాడు. తోటి ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ అయింది.
సంచలనంగా మారిన ఈ వీడియోపై ఢిల్లీ మహిళా కమినర్ స్వాతి మలివాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత జుగుస్పాకరమైన ఉన్న ఈ వీడియోలోని యువకుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు, ఢిల్లీ మెట్రో అధికారులకు నోటీసులు జారీ చేశారు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ యువకుడు హస్తప్రయోగం చేస్తుంటే చావబాదకుండా తోటి ప్రయాణికులు ఎందుకు మౌనంగా ఉన్నారని కామెంట్స్ చేస్తున్నారు. కాగా కొద్దిరోజుల క్రితం ఓ యువతి కేవలం కేవలం బ్రా, మినిస్కర్ట్ ధరించి ఢిల్లీ మెట్రోలో తిరిగిన వీడియో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.


