TS SSC Board | తెలంగాణ ఎస్‌ఎస్‌సీ బోర్డు పూర్తిస్థాయి డైరెక్టర్‌గా ఎ.కృష్ణారావు నియమించినట్లు ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర విద్యాశాఖ. రాష్ట్ర విద్యా, సాంకేతిక సంస్థ డైరెక్టర్‌గా ఉన్న కృష్ణారావు.. రెండేళ్ల నుంచి ఎస్‌ఎస్‌సీ బోర్డు ఇంఛార్జ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. తాజాగా, రాష్ట్ర విద్యా, సాంకేతిక సంస్థ డైరెక్టర్ పోస్టు నుంచి కృష్ణారావును బదిలీ చేస్తూ బోర్డు డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగిస్తూ పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ శ్రీదేవసేన ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఖాళి అయిన రాష్ట్ర విద్యా, సాంకేతిక సంస్థ డైరెక్టర్ స్థానంలో ఎస్.విజయలక్ష్మి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.అలాగే వీరితో పాటుగా పలువురు ఏడీలను బదిలీ చేశారు. వయోజన విద్య డైరెక్టర్‌గా జి.ఉషారాణిని నియమించారు. ప్రస్తుతం టీఎస్‌ఆర్‌జేసీ కార్యదర్శిగా ఉన్న సి.హెచ్.రమణకుమార్‌ను.. మోడల్ స్కూల్స్ అదనపు డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలతో పాటుగా.. జవహర్ బాలభవన్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.