ఎన్నికల ముంగిట అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్ తగిలింది. శృంగార తార స్టార్మీ డేనియల్‌తో అక్రమ సంబంధం కేసులో ట్రంప్ దోషిగా తేలారు. కేసులో ఆయనపై నమోదైన అన్ని ఆరోపణలు రుజువైనట్లు న్యూయార్క్ కోర్టు తెలిపింది. దాదాపు 34 అంశాల్లో ట్రంప్‌ను దోషిగా నిర్ధారిం చింది కోర్టు. మరో ఐదు నెలల్లో అమెరికాలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ తీర్పు వెలువ డటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇలా ఓ కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచాడు. స్టార్మీ డేనియల్‌తో ట్రంప్ గతంలో ఏకాంతంగా గడిపారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో దీనిపై ఆమె నోరు విప్పకుండా ట్రంప్ పెద్ద మొత్తంలో డబ్బు ముట్టజెప్పారని అభియోగాల్లో పేర్కొన్నారు. తన న్యాయవాది ద్వారా ఆమెకు సొమ్ము ఇప్పించారని తెలిపారు. ప్రచార కార్యక్రమాల కోసం అందిన విరాళాల నుంచి ఆ మొత్తాన్ని ఖర్చు చేశారని పేర్కొన్నారు. అందుకోసం బిజినెస్ రికార్డులన్నింటినీ తారుమారు చేశారన్నది ప్రధాన ఆరోపణ.దోషిగా తేలడంతో ట్రంప్ జైలుకెళ్లాల్సిందేనా అనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. దీనికి కచ్చితమైన సమాధానం చెప్పలేమని నిపుణులు అంటున్నారు. జులై 11న ఆయనకు కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. బిజినెస్ రికార్డులు తారుమారు చేయడమనేది న్యూయార్క్‌లో తక్కువ తీవ్రత ఉన్న నేరంగా పరిగణిస్తారు. గరిష్ఠంగా నాలు గేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. దీనిపై పూర్తి విచక్షణాధికారం న్యాయమూర్తిదే. కచ్చితం గా జైలు శిక్ష విధిస్తారని కూడా చెప్పలేమని అక్కడి న్యాయ నిపుణులు వెల్లడించారు.