సునిశిత హాస్యం, ప్రేమ, ఫ్యామిలీ డ్రామాల అద్వితీయమైన సమ్మేళనం ‘ఎటో వెళ్లిపోయింది మనసు’. ఈ డైలీ సీరియల్‌ను ‘స్టార్ మా’ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఈ ఆకర్షణీయమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ నిన్నటి నుంచి స్టార్ మాలో ప్రసారం అవుతోంది. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు స్టార్ మాలో ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ సీరియల్ ప్రసారం అవుతుంది.
ఇక సీరియల్ విషయానికి వస్తే 40 ఏళ్ల సీతాకాంత్ విజయవంతమైన వ్యాపారవేత్త. బాధ్యతలు కలిగినప్పటికీ వినోదాన్ని అభిమానించే 20 ఏళ్ల రామలక్ష్మి పాత్రలో రక్ష కనిపిస్తుంది. వీరిద్దరి జీవితాల ద్వారా ప్రేక్షకులను ఆహ్లాదకరమైన ప్రయాణంలో నడిపిస్తుంది ‘ఎటో వెళ్లిపోయింది మనసు’. సీతాకాంత్ పాత్రను సీతాకాంత్ పోషించారు. ఆయన జీవితం ఒక క్రమ పద్దతిలో వెళ్లాలనుకుంటారు. ఈ రెండు పాత్రల మధ్య వయస్సు అంతరం వినోదభరితమైన ఘర్షణలకు దారి తీస్తుంది.. హృద్యమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు సరైన నేపథ్యాన్ని సృష్టిస్తుంది. సీతాకాంత్ ఖచ్చితమైన స్వభావం, రామలక్ష్మి నిర్లక్ష్య స్ఫూర్తితో ఢీకొంటూ ప్రేమ, నవ్వు కుటుంబ బంధాలను మిళితం చేసే ప్రయాణానికి వేదికగా నిలుస్తుంది. ప్రేమంటే వయసు, అభిరుచుల తూకం కాదు , రెండు గుండెల చప్పుడు అని చెబుతుంది.