బీహార్‌లో మరో వంతెన కుప్పకూలింది. సివాన్ జిల్లాలో చిన్నపాటి వంతెన ఒకటి కూలి 24 గంటలు గడువక ముందే నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలిపోయింది. మోతీహరిలో రూ.1.5 కోట్లతో 40 అడుగుల విస్తీర్ణంలో వంతెన నిర్మిస్తున్నారు. నాణ్యత లోపం వల్లే ఒక్కసారిగా వంతెన కూలిపోయింది. సిమెంటు, ఇసుక తగినపాళ్లలో సరిపోకపోవడం, కాస్టింగ్ కోసం ఏర్పాటు చేసిన సెంట్రింగ్ పైపు బలహీనంగా ఉండ టంతో బ్రిడ్జి కూలిపోయిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో వారం రోజుల్లోనే రాష్ట్రంలో వంతెనలు కుప్పకూలిపోవడం ఇది మూడోసారి. అరారియాలోని బక్రా నదిపై రూ.12 కోట్లతో నిర్మించిన బ్రిడ్జి ఈ నెల 18న కూలిపోయింది. ఈ నెల 22 సివాన్‌లోని గండక్ కాలువపై వంతెన కుప్పకూలింది. ఈ నేపథ్యంలో నదులు, కాలువలపై నిర్మించిన వంతెనల పటిష్టతపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.