స్వతంత్ర, వెబ్ డెస్క్: పామును ఓ బాలుడు నోటితో కొరికి చంపేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఫరూఖాబాద్ జిల్లాలోని మద్నాపుర్ గ్రామంలో దినేశ్‌సింగ్ అనే వ్యక్తి నివాసముంటున్నాడు. అతనికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే శనివారం ఆ బాలుడు ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో ఓ పాము అక్కడకు వచ్చింది. దీంతో బాలుడు ఎలాంటి భయం లేకుండా పామును పట్టుకొని నోటితో కొరికి చంపాడు. అనంతరం పాము విషం నోట్లోకి వెళ్లడంతో స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు అప్రమత్తమై చనిపోయిన పాముతోపాటు బాలుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే స్పందించి సకాలంలో మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.