Visakha Steel Plant | విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ లేఖ రాశారు. స్టీల్ ప్లాంట్ వర్కింగ్ క్యాపిటల్ కోసం ప్రజలనుంచి విరాళాల సేకరణకు అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు. అయోధ్యలో రామ మందిరం కోసం నిధులు విరాళాల రూపంలో సేకరించిన విధంగా స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం కూడా అనుమతించాలని స్టీల్ ప్లాంట్ సీఎండికి లేఖలో వివరించారు. విరాళాల సేకరణకు అనుమతిస్తారా? లేదా? అనేది స్పష్టం చేయాలని కోరారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఈఓఐ బిడ్డింగ్ గడువు గురువారంతో ముగిసింది. అందరూ ఎదురుచూసినట్లుగా తెలంగాణకు చెందిన సింగరేణి సంస్థ బిడ్ దాఖలు చేయలేదు. విశాఖలో సింగరేణి కాలరీస్ అధికారుల బృందం పర్యటించి.. అన్ని పరిశీలించిన తర్వాత తెలంగాణ సర్కారు బిడ్డింగ్ కు దూరంగా ఉంది. ఈఓఐ గడువు 5 రోజులు పెంచినా బిడ్డింగ్ కు పెద్ద స్పందన రాలేకపోయింది. విశాఖ స్టీల్ కోసం 6 అంతర్జాతీయ సంస్థలు బిడ్డింగ్ లో పాల్గొన్నాయి. మొత్తం 22 కంపెనీలు బిడ్లు దాఖలు చేసింది.