తెలుగు సినిమాలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మంచి ఆదరణ అందుకుంటున్నాయి. అందుకే ఇండియా వైడ్ ప్రజలు మన సినిమాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ మూవీ డేటా బేస్ వెబ్ సైట్ IMDB ఓ సర్వే చేపట్టింది. ఈ సమ్మర్ లో థియేటర్లలో చూడడానికి ఏ సినిమాల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారని ఓ సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో మన తెలుగు ఇండస్ట్రీకి చెందిన హీరోల సినిమాలు నాలుగు ఉండడం విశేషం. మొదటి స్థానంలో బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ నటించిన ‘జవాన్’ ఉండగా.. రెండవ స్థానంలో రణబీర్ ‘యానిమల్’ సినిమా ఉంది. ఇక మూడవ స్థానంలో రెబల్ స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రం నిలిచింది. ఇక 5వ స్థానంలో బెల్లంకొండ శ్రీనివాస్ ‘ఛత్రపతి’, 9వ స్థానంలో ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’, 10వ ప్లేస్ లో నాగచైతన్య ‘కస్టడీ’ చిత్రాలు నిలిచాయి.
Summer is here…and so are we with our list of The Most Anticipated Indian Movies of 2023 🤝💛 pic.twitter.com/FC9lUGHUMj
— IMDb India (@IMDb_in) April 19, 2023