Adilabad | ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో హిందూ సంఘాల బంద్ తో ఉద్రిక్తత నెలకొంది. బంద్ ను పురస్కరించుకొని అంబేడ్కర్ చౌక్ లో దుకాణాలను మూసి వేయాలని ప్రయత్నించిన పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురిని అరెస్ట్ చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అంబేడ్కర్ జయంతి వేడుకల్లో రిమ్స్ ఎదుట హిందూ సంఘాల జండాలు అవమానించారని బీజేపీ నేతలు ధర్నా చేసి అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో నేడు హిందూ సంఘాల బంద్ నిర్వహించారు. హిందూ సంఘాల జండాలను అవమానించిన వారిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదని డిమాండ్ చేశారు.


