Karunakar Reddy Kidnap| తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో హై టెన్షన్ నెలకొంది. కొత్తూరు ప్రధాన కూడలి వద్ద మృతుడు కరుణాకర్ రెడ్డి కుటుంబం ఆందోళనకు దిగింది. రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం జరుగాలని కోరారు. ఎంపీపీ మధుసూదన్ రెడ్డితో పాటు నలుగురిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
నిన్న కొత్తూరులో కిడ్నాప్ కు గురైన కరుణాకర్ హత్యకు గురయ్యాడు. కరుణాకర్ రెడ్డిని కిడ్నాప్ చేసిన దుండగులు కాళ్ళూ, చేతులూ కట్టేసి అతడిని చితకబాదారు. కిడ్నాపర్ల దాడిలో కరుణాకర్ రెడ్డి మృతి చెందారు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి సమీపంలో హత్యచేసి మృతదేహాన్ని వదిలివెళ్లారు కిడ్నాపర్లు. అయితే తన కొడుకు కరుణాకర్ ను ఎంపీపీ మధుసూదన్ రెడ్డి అనుచరులే కిడ్నాప్ చేశారని తల్లి స్వరూప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కారులో వెళ్తున్న కరుణాకర్ రెడ్డిపై దాడిచేసి కిడ్నాప్ కు పాల్పడినట్లు తెలిపింది. పాత కక్షల నేపథ్యంలోనే ఎంపిపి తన అనుచరులతో ఈ ఘటనకు పాల్పడినట్లు వెల్లడించింది.


