మహబూబ్ నగర్(Mahabubnagar) జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపింది. జిల్లాలో ఇటీవలే దాదాపు 40 మంది వింత ప్రవర్తన, వాంతులు, విరేచనాలు, కాళ్లు చేతులు వంకర్లు పోవడం వంటి లక్షణాతో ఆస్పత్రి పాలవ్వగా… ఇందులో ముగ్గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉండటంతో హైదరాబాద్ లోని నిమ్స్ కి తరలించారు. అయితే వీరంతా కల్తీ కల్లు తాగటం వల్లే ఇలా అనారోగ్యం పాలయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మృతులు కోడూరుకు చెందిన ఆశన్న ఆదివారం రాత్రి మృతి చెందగా.. మహబూబ్‌నగర్‌లోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన విష్ణుప్రకాశ్ మంగళవారం రాత్రి మరణించారు. తాజాగా, కోడూరు గ్రామానికి రేణుక అనే మహిళ మృత్యు ఒడికి చేరింది.
ఈ ఘటనపై ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందిస్తూ.. కల్తీకల్లు వల్ల వీరు మృతి చెందలేదని, అనారోగ్యం కారణంగానే మృతి చెందారని తెలిపారు. వైద్య పరీక్షల్లోనూ డాక్టర్లు ఇదే తేల్చారని పేర్కొన్నారు. శవ పరీక్ష కోసం వీరి వద్ద నుండి నమూనాలు సేకరించి, ఫోరెన్సిక్ కు పంపామన్నారు. రిపోర్ట్ లో కల్తీ కల్లు కారణంగానే చనిపోయారని తేలితే.. బాద్యులను ఎట్టి పరిస్థితులలో విడిచిపెట్టేది లేదన్నారు.
Read Also: కవిత-సుకేశ్ వాట్సాప్ చాట్ పై ఈడీకి రఘునందన్ ఫిర్యాదు
Follow us on: Youtube, Koo, Google News