ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు(Karumuri Nageswara Rao) వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి హరీశ్ రావు(Harish rao) ఘాటు కౌంటర్లు ఇచ్చారు. తెలంగాణలో ఏముందని ప్రశ్నిస్తోన్న ఏపీ మంత్రి ఇక్కడికి వచ్చే చూస్తే ఏముందో తెలుస్తుందన్నారు. 56లక్షల ఎకరాల్లో యాసంగి పంట ఉందని.. బోరు బావుల వద్ద 24గంటల కరెంటు ఉందన్నారు. అన్నదాతల కోసం రైతు బీమా, రైతు బంధు ఇస్తున్నామన్నారు. మీ దగ్గర ఏం ఉందని ప్రశ్నించారు.
అధికార వైసీపీ నేతలు అప్పుడేమో ఏపీకి ప్రత్యేక హోదా అని అడిగారు.. ఇప్పుడేమో హోదా ఇవ్వకపోతే అడగరని ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కుని తుక్కు కింద పెట్టినా మాట్లాడని పరిస్థితిలో ఏపీ నేతలు ఉన్నారని తెలిపారు. అధికార పక్షం వైసీపీ, ప్రతిపక్షం టీడీపీ రెండు పార్టీలు మౌనంగా ఉంటూ ప్రజలను ఆగం చేస్తున్నాయని విమర్శించారు.
ఆంధ్ర మంత్రులు అనవసరంగా మా జోలికి రాకండి.. వస్తే మీకు మంచిది కాదని హెచ్చరించారు. కాగా అంతకుముందు తెలంగాణలో ఉన్న ఏపీ కార్మికులు అక్కడ ఓటు హక్కు రద్దు చేసుకుని.. తెలంగాణలో పొందాలని హరీశ్ రావు(Harish Rao) వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై ఏపీ వైసీపీ నేతలు విమర్శలు చేశారు.
Also Read: హైదరాబాద్ తప్ప తెలంగాణలో అభివృద్ధి ఎక్కడా? హరీశ్: కారుమూరి
Follow us on: Youtube, Koo, Google News