Minister Sabitha Indra Reddy | తెలంగాణలో నిన్న పరీక్ష జరుగుతుండగా ఒక ప్రశ్నాపత్రం లీక్ అవ్వగా.. నేడు మరొక హిందీ పేపర్ లీక్ అయిందని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం పై రాష్ట్రంలో గందరగోళం నెలకొన్న వేళా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఆమె మాట్లాడుతూ… నేడు పేపర్ ఎక్కడ లీక్ కాలేదని స్పష్టం చేశారు. పదవ తరగతి విద్యార్థుల జీవితాలతో ఎవరూ చెలగాటం ఆడద్దని సూచించారు. విద్యార్థుల పరీక్షల విషయంలో రాజకీయ స్వార్ధం, వ్యక్తిగత స్వార్ధం పక్కన పెట్టాలని మనవి చేశారు. 10వ తరగతి పరీక్షల(SSC Exams) విషయంలో జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాలు, పోలీసు విభాగం, పోస్టల్ డిపార్ట్‌మెంట్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) అన్నారు. 4 లక్షల 95వేల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనమంతా బాధ్యతగా పనిచేద్దామని అన్నారు. మొదటిసారి బోర్డు ఎగ్జామ్స్ రాస్తున్న చిన్నారులను గందరగోళ పరిస్థితులకు గురిచేయడానికి ఎవరు ప్రయత్నించినా వారిపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు.
Read Also: భార్య, భర్తల మధ్య మనస్పర్థలకు కారణాలు తెలుసా.. ఇలా చేస్తే లైఫ్ బిందాస్..
Follow us on: Youtube, Instagram, Google News