సీనియర్ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్ కృష్ణ అనారోగ్యంతో కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ తుదిశ్వాస విడిచారు. అల్లరి మొగుడు, పుట్టింటికి రా చెల్లి, దేవుళ్లు, మా ఆయన బంగారం, భారత్ బంద్ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. కోడి రామకష్ణ దర్శకత్వంలో వచ్చిన భారత్ బంద్ చిత్రం ద్వారా నటుడిగా పరిచమయ్యారు. ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించారు. అలాగే పెళ్లిపందిరి సినిమాతో నిర్మాతగా కూడా మారి అనేక సినిమాలు తీశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి ఆయన గురువుగా ఉండేవారు.


