IPL Cricket | క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఏపీఎల్ పండుగ మొదలైయింది. ఇప్పటికే హైదరాబాద్ లో ఐపీఎల్ ఫీవర్ షురూ అయింది. రేపు మధ్యాహ్నం రాజస్థాన్ రాయల్స్ జట్టు… సన్ రైజర్స్ జట్టుతో తలపడనుంది. ఈ క్రమంలో నగర పోలీసులు ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. రేపటి మ్యాచ్ ఏర్పాట్లు గురించి రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్ భద్రతా ఏర్పాట్ల గురించి మీడియాకు వెల్లడించారు. నగరంలో భద్రత కల్పించేందుకు 1500 మంది పోలీస్ బలగాలతో భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్ ను చూసేందుకు వచ్చిన అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా… అలాగే నగర వాససులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు. క్రికెట్ మ్యాచ్(IPL Cricket) ముగిసిన తర్వాత నగరపౌరులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీసులు సూచించిన మార్గాల్లో వెళ్లాలని తెలిపారు. అలాగే ఆన్ లైన్ లో టికెట్స్ విక్రయాలు జరిగాయని తెలిపారు. ఎవరైనా బ్లాక్ లో టిక్కెట్లు విక్రయిస్తే మాత్రం ఉపేక్షించేది లేదని తెలిపారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలో ఎలాంటి అఘాయిత్యాలు జరుగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.
Read Also: మొదలైన ఐపిఎల్ మ్యాచ్‌లు.. ఎక్కువ ఆశపడ్డారా.. ఇక అంతే..
Follow us on: Youtube, Instagram, Google News