37.5 C
Hyderabad
Thursday, April 24, 2025
spot_img

ఏప్రిల్ 25న ‘శివ శంభో’ గ్రాండ్ రిలీజ్

తెలుగు వెండితెర‌పై మ‌రో భ‌క్తిర‌స చిత్రం క‌నువిందు చేయ‌బోతోంది. అనంత ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై కృష్ణ ఇస్లావత్, కేశవర్థిని బేబీ రిషిత ప్ర‌ధాన పాత్ర‌ల్లో, నర్సింగ్ రావు ద‌ర్శ‌క‌త్వంలో బొజ్జ రాజ గోపాల్, దోరవేటి సుగుణ, శ్రీశైలం రెడ్డి నిర్మించిన చిత్రం “శివ శంభో”. తనికెళ్ళ భరణి, సుమన్ ముఖ్య‌పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రం ఈనెల 25న థియేట‌ర్‌ల‌లో విడుద‌ల కాబోతోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘ‌నంగా నిర్వ‌హించింది. ముఖ్య అతిథులుగా బీజేపీ నేత, జంతు ప్రేమికుడు చీకోటి ప్ర‌వీణ్, ప్ర‌ముఖ న‌టుడు, ర‌చ‌యిత‌ త‌నికెళ్ల భ‌ర‌ణి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్, చిత్రపురి కాలనీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్, త‌దిత‌రులు పాల్గొని చిత్ర‌యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖ న‌టుడు, ర‌చ‌యిత‌ త‌నికెళ్ల భ‌ర‌ణి మాట్లాడుతూ.. “చిత్ర‌యూనిట్ స‌భ్యులంద‌రికి పేరుపేరున‌ శుభాకాంక్ష‌లు, అభినంద‌న‌లు. ఇలాంటి భ‌క్తిర‌స చిత్రాలు చాలా అరుదుగా వ‌స్తాయి. భారతీయ కళలైన సంగీతం, సాహిత్యం, నృత్యం ప్రధానాంశాలుగా కలిగిన ఈ సందేశాత్మక చిత్రాన్ని ప్ర‌తి ఒక్క‌రు ఆద‌రించాలి”. అని అన్నారు.

బీజేపీ నేత, జంతు ప్రేమికుడు చీకోటి ప్ర‌వీణ్ మాట్లాడుతూ.. “నర్సింగ్ రావు గారు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్ర‌తి ఒక్క‌రి హృద‌యాల్లో నిలిచిపోతుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ప్ర‌చార చిత్రాల‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. తెలుగు చిత్ర‌సీమ‌లో ఇది చెప్పుకోద‌గ్గ సినిమాగా నిల‌వాల‌ని కోరుకుంటున్నాను”. అని అన్నారు.

ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ.. “సంగీతం, సాహిత్యం, నృత్యం ప్రధానాంశాలుగా కలిగిన ఈ అరుదైన సినిమాను మ‌నమంతా గౌర‌వించాలి. ఇటువంటి చిత్రాలను ఉత్తమ అభిరుచి గల ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. చిత్ర‌యూనిట్ స‌భ్యులంద‌రికి పేరుపేరున‌ శుభాకాంక్ష‌లు, అభినంద‌న‌లు”. అని అన్నారు..

చిత్ర నిర్మాతల్లో ఒకరు, రచయిత, సంగీత దర్శకులు దోరవేటి మాట్లాడుతూ.. “ఏప్రిల్ 25న “శివ శంభో” చిత్రం విడుద‌ల చేస్తున్నాం. ప్ర‌తి ఒక్క‌రూ థియేట‌ర్‌కు వెళ్లి చూసి సినిమాను ఆద‌రించాల‌ని కోరుతున్నాము. ఇప్ప‌టికే విడుద‌లైన ప్ర‌చార చిత్రాలకు మంచి స్పంద‌న వ‌చ్చింది. ప్ర‌తి ఒక్క‌రూ అభినందిస్తున్నారు.” అని అన్నారు.

బ్యానర్ :అనంత ఆర్ట్స్
నిర్మాతలు: బొజ్జ రాజ గోపాల్, దోరవేటి సుగుణ, శ్రీశైలం రెడ్డి
డైరెక్టర్: నర్సింగ్ రావు
డిఓపి: కారె సతీశ్ కుమార్
హీరో హీరోయిన్: కృష్ణ ఇస్లావత్, కేశవర్థిని బేబీ రిషిత
పాటలు మాటలు, సంగీతం: దోరవేటి
ముఖ్యపాత్రలో: తనికెళ్ళ భరణి, సుమన్, టార్జాన్, విజయ్ రంగరాజన్, చిల్లర వేణు, రామస్వామి, రజాక్, మల్లేశ్, రవిరెడ్డి, రమేష్ యాదవ్, శ్రీకర్, విగ్నేష్.

Latest Articles

ముక్కురాజ్ మాస్టర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఆర్ నారాయణమూర్తి

తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్(టీఎఫ్‌టీడీడీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు సాయిరాజు రాజంరాజు అలియాస్ ముక్కురాజు మాస్టర్ విగ్రహ ఆవిష్కరణ వేడుక బుధవారం ఉదయం ఘనంగా జరిగింది. టీఎఫ్‌టీడీడీఏ కార్యాలయం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్