ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ.. 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత దేశ రాజధానిలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది. అయితే ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ముహుర్తం ఖరారైంది. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం ఫిబ్రవరి 19న జరగనుంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 8వ తేదీన వెలువడగా.. మొత్తం 70 స్థానాలకుగానూ బీజేపీ 48 చోట్ల, ఆమ్ ఆద్మీ పార్టీ 22 చోట్ల విజయం సాధించింది. దీంతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు సిద్దమవుతుంది.అయితే పలువురు బీజేపీ నేతలు సీఎం రేసులో ఉన్నారు.
అయితే ఢిల్లీ కొత్త సీఎం ఎంపికకు సంబంధించి బీజేపీ అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై బీజేపీలో అంతర్గత సంప్రదింపులు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ విదేశీ పర్యటన ముగియగా.. ఆయన ఢిల్లీ చేరుకున్న తర్వాత పార్టీ సీనియర్ నాయకులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో సీఎం, మంత్రులను ఎంపికపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.