ఏ నాగరిక దేశానికైనా బ్యాంకులు బ్యాక్ బోన్ అని ఏ ఆర్థిక వేత్తయినా గొంతెత్తి చెబుతారు. రైజింగ్ ప్రైసెస్, అనెంప్లాయ్ మెంట్, సెవరల్ క్రైసెస్ కు పరిష్కారం చెప్పేవి బ్యాంకులు. సర్కారుకు ప్రజలకు సంధాన కర్తల్లా వ్యవహరించేవి బ్యాంకులే. వడ్డి వ్యాపారుల కబంధ హస్తాల నుంచి నిరుపేద, మధ్యతరగతి వర్గాలను పరిరక్షించేవి బ్యాంకులే. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీట్ లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బ్యాంకర్లతో పలు అంశాలపై చర్చించారు. మరెన్నో విషయాలపై బ్యాంకర్లకు దిశానిర్దేశం చేశారు. వినియోగదారులకు బ్యాంకర్లు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఆయన అన్నారు.
స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రయాణంలో బ్యాంకులు భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు కోరారు. అందరి ఆకలి తీర్చడం కోసం అహర్నిశలు శ్రమించే అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకోవడం దారుణమని, ఎట్టి పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి లేకుండా చూడాల్సిన బాధ్యత మన అందరి పైనా ఉందని ఆయన చెప్పారు. ఇందులో బ్యాంకర్లు బాధ్యత మరింత ఎక్కువని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాల వ్యవహారంలో దర్యాప్తు సంస్థలకు సహకరించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా సీఎం పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
గత ప్రభుత్వ అక్రమాలపై దర్యాప్తు సంస్థలకు బ్యాంకులు సమాచారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు. పీఎం సూర్యఘర్ కింద ఏడాదిలో 20 లక్షల ఇళ్లకు సోలార్ విద్యుత్ లక్ష్యం అని చెప్పారు. ప్రజల ఆహార అలవాట్లు చాలా మారాయని ఆయన తెలిపారు. అగ్రికల్చర్ స్థానంలో హార్టి కల్చర్ వస్తోందని అన్నారు. హార్టీకల్చర్, ప్రకృతి సాగుకు బ్యాంకులు మద్దతుగా నిలవాలని సీఎం చెప్పారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కనిపించకూడదని అన్నారు. రైతుల బాగు కోసం బ్యాంకులు, ప్రభుత్వం కలిసి పనిచేయాలని తెలిపారు. ఎంఎస్ఎఈ రుణాలను కేంద్రం సులభతరం చేసిందని చెప్పారు.
బ్యాంకులతో సంబంధ బాంధవ్యాలు లేని వ్యక్తులు సమాజంలో ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదేమో. రుణాలు, రుణమేళాలు, డిపాజిట్లు, అకౌంట్లు, వడ్డీలు.. ఇలా ప్రతి అంశంలో బ్యాంకుతో ప్రతి ఒక్కరికి టచ్ ఉంటుంది. డ్వాక్రా మహిళలు, దివ్యాంగులు, వృద్ధులు, నిరుద్యోగులు, వృత్తి పనివారులు, కుటీర పరిశ్రమల యాజమాన్యాలు…ఇలా ఎందరో బ్యాంకు సేవలు పొందుతున్నారు. ఎందరో నిరుద్యోగులు ఎన్నో పెద్ద గొప్ప చదువులు చదువుకున్నా ఉద్యోగాలు రాక…మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఎన్నో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నిరుద్యోగి అని సమాజ అవహేళనలకు గురవుతున్నారు. కొలువుల కోసం కాలం వెళ్లబుచ్చి, నిరాశ నిస్పృహలకు గురయ్యే నిరుద్యోగులకు.. స్వయం ఉపాధి పథకాలకు, పరిశ్రమల స్థాపనకు బ్యాంకులు ఎంతో సహాయ, సహకారాలు అందిస్తున్నాయి. దేశం నిజమైన సూచికలుగా బ్యాంకింగ్ కార్యకలాపాలను చెబుతారు. అందుకే సీఎం చంద్రబాబునాయుడు.. బ్యాంకర్ల పాత్రను ప్రశంసిస్తూ… తమ సంపూర్ణ సహాయ, సహకారాలు ప్రజలకు అందచేసి, సమాజాభివృద్దికి, ప్రజా సంక్షేమానికి పాటుపడాలని కోరారు.