చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ఫోన్ లో చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్ ను పరామర్శించారు ముఖ్యమంత్రి. ఇలాంటి దాడులను సహించేది లేదని… దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిలుకూరు ఆలయం సమీపంలోని రంగరాజన్ ఇంట్లోకి శుక్రవారం కొందరు వ్యక్తులు వచ్చారు. రామరాజ్యం స్థాపనకు మద్దతు ఇవ్వాలని కోరారు. అందుకు ఆయన నిరాకరించడంతో .. వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆయనతో పాటు అతని కుమారుడిపై కూడా దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన వారిలో వీరరాఘవరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు.