ఆర్‌ఎంపీ, పీఎంపీలపై వేధింపులు ఆపాలని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆర్‌ఎంపీ, పీఎంపీలపై మెడికల్ కౌన్సిల్ దాడులు ఆపాలని డిమాండ్ చేశారు. తమకు శిక్షణా తరగతులు నిర్వహించాలని, హెల్త్ గైడ్‌లుగా గుర్తించాలని కోరారు. గ్రామీణ వైద్యులకు మద్దతుగా హరీశ్‌రావు ధర్నాలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్‌ఎంపీ, పీఎంపీలను భయపెడుతోందని మండిపడ్డారు. వారిపై ఉన్న అక్రమ కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్‌ఎంపీ, పీఎంపీలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు.