సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్ అనే భావనను కాంగ్రెస్ నుంచి ఆశించడం తప్పిదమే అవుతుందని ప్రధాని మోదీ విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగం స్ఫూర్తిదాయకంగా, ప్రభావవంతంగా ఉందని కొనియాడారు. అది మనందరికీ ముందుకు సాగే మార్గాన్ని చూపించిందని తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ రాజ్యసభలో ప్రసంగించారు. పేద ప్రజల అభ్యున్నతి కోసమే తమ కార్యక్రమాలు ఉంటాయని… పదేళ్లుగా సుపరిపాలన అందిస్తున్నామన్నారు. కాంగ్రెస్‌కు ఫ్యామిలీనే ఫస్ట్ అని… నేషన్ ఫస్ట్ అనేది తమ విధానమని తెలిపారు.