విద్యార్థుల్లో పరీక్షలంటే భయాన్ని పోగొట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతి ఏడాది పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏడాది మాత్రం సరికొత్తగా నిర్వహించబోతున్నారు. 2025 ఎనిమిదవ ఎడిషన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో పాల్గొనడానికి కొందరు ప్రముఖులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ సంవత్సరం ఇంటరాక్టివ్ ప్రోగ్రాం కొత్త ఫార్మాట్ లో జరగనుంది.
కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖుల జాబితా
1..సద్గురు
2..దీపికా పదుకొనే
3..మేరీ కోమ్
4..అవని లెఖర
5..రుజుటా డైవెకర్
6..సోనాలి సభర్వాల్
7..ఫుడ్ ఫార్మర్
8..విక్రంత్ మాస్సే
9..భుమి పెడ్నెకర్
10..సాంకేతిక గురుజీ
11..రాధిక గుప్తా
ఈ కార్యక్రమం జనవరి 10న ఢిల్లీలోని భారత్ మండపమ్ వద్ద టౌన్ హాల్ లో జరగబోతుంది. 6 నుండి 12 తరగతుల విద్యార్థులకు పరీక్ష , ఒత్తిడిని అధిగమించడానికి ప్రతి ఏటా నిర్వహిస్తారు. ఈ ఇంటరాక్టివ్ కార్యక్రమంలో పాల్గొనేవారికి ప్రధానమంత్రిని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది.
పరీక్షా పే చర్చ 2025లో పాల్గొనేందుకు మన దేశం నుంచే కాకుండా విదేశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుండి 3.30 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లతో అపూర్వమైన మైలురాయిని సాధించింది. పరీక్షా పే చర్చ 2025 కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ డిసెంబర్ 14, 2024 న ప్రారంభమై జనవరి 14, 2025 న ముగిసింది.
పరీక్షా పే చర్చ స్ఫూర్తితో జనవరి 12 నుంచి 23 పాఠశాలల్లో పలు కార్యక్రమాలు నిర్వహించారు.
స్వదేశీ ఆటల సెషన్లు
మారథాన్ రన్
మీమ్స్ పోటీలు
నుక్కాడ్ నటాక్
యోగా-కమ్-మెడిటేషన్ సెషన్లు
పోస్టర్ తయారీ పోటీలు
ఇన్స్పిరేషనల్ ఫిల్మ్ స్క్రీనింగ్స్
మానసిక ఆరోగ్య వర్క్‌షాప్‌లు , కౌన్సెలింగ్ సెషన్‌లు
కవిత్వం / పాట / ప్రదర్శనలు
పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని 2018లో మొదలుపెట్టారు. ఇది ప్రతి ఏడాది విద్యార్థుల్లో పరీక్షలపై ఉన్న భయాన్ని పోగెట్టేందుకు నిర్వహిస్తున్న కార్యక్రమం. ఎంపికైన విద్యార్థులు ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నలు అడిగే అవకాశం కల్పిస్తారు. విద్యార్థులకు పలు సూచనలు చేస్తారు.