చేతికి సంకెళ్లు, చైన్‌లతో కట్టేసి చాలా మంది ఫైటర్ జెట్ విమానంలో కూర్చుని ఉన్న ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే వీరంతా భారతీయులని, అమెరికా నుంచి అక్రమ వలసదారులను ఇండియాకు పంపిస్తున్నారని పుకార్లు షికార్లు చేశాయి. అక్రమ వలసదారులను బహిష్కరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించిన తర్వాత వచ్చిన ఫోటో ఇది.
యుఎస్ మిలిటరీ జెట్, సి -17 విమానం ఫిబ్రవరి 4న అంటే మంగళవారం టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియో నుండి 205 మంది భారతీయులను తీసుకొని బయల్దేరింది.
ఇందులో నిజమెంత?
నిజానికి ఈ ఫోటో తాజాదే. అయితే ఇందులో ఉన్నది భారతీయులు కారు. వాస్తవానికి అమెరికాలోని కొందరు అక్రమ వలసదారులను గ్వాటెమాలకు పంపిస్తున్న చిత్రాలవి.
ఇది నిజమని ఎలా తెలిసింది?
గూగుల్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఇది జనవరి 30 న ది ఇండిపెండెంట్ షేర్ చేసిన నివేదికగా తేలింది.
ఈ నివేదిక ప్రకారం.. అక్రమ వలసదారులను మెక్సికోలోని గ్వాటెమాలకు పంపిస్తున్నారని తెలిసింది. ఈ వైరల్ ఇమేజ్ కూడా ఉంది. ఈ రిపోర్ట్‌లో భారతీయుల గురించి ఎలాంటి సమాచారం లేదు.
బుధవారం తొలివిడతలో భాగంగా అమెరికా నుంచి 104 మంది వలసదారులు స్వదేశానికి చేరుకున్నారు. వీరిని పోలీసులు తనిఖీ చేసి, వివరాలను పరిశీలించాక ఇళ్లకు పంపారు. వీరిలో కొంతమంది అమెరికా వెళ్లేందుకు తాము పడిన కష్టాలను మీడియాతో పంచుకున్నారు. ఏజెంట్ల మోసంతోనే తాము అక్రమంగా అగ్రరాజ్యానికి వెళ్లాల్సి వచ్చిందని కన్నీరుపెట్టుకున్నారు.