కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం పార్లమెంటులో కీలక వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ నేతృత్వంలోని యూపీఏ లేదా గత దశాబ్ద కాలంగా దేశాన్ని పాలించిన ప్రధాని నరేంద్ర మోదీకి చెందిన బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కానీ.. దేశంలోని నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేకపోయాయని అన్నారు.
రాహుల్ గాంధీ సోమవారం పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు అందిరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఎందుకంటే రాహుల్ తన మాటల దాడిలో ప్రశంసలు కూడా ఉన్నాయి. ఎప్పుడూ ఎన్డీయే ప్రభుత్వం, ప్రధాని మోదీపై చెలరేగి మాట్లాడే రాహుల్ గాంధీ.. ఈ సారి అంతగా మాటలతో దాడులు చేయకపోగా.. ప్రశంసలు కూడా కురిపించారు. రాహుల్ ఏమన్నారంటే.. భారతదేశం తయారీ రంగంలో ఇంకా ముందడుగు వేయల్సి ఉందని అన్నారు. అదే సమయంలో ..” ప్రధాని మోదీ ఉత్పాదకతను పెంచడానికి ప్రయత్నించారు.. ఆయన ప్రధాన చొరవ మేక్ ఇన్ ఇండియా మంచి కాన్సెప్ట్”.. అని అన్నారు.
“మనం వేగంగా అభివృద్ధి చెందుతున్నా.. మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏమిటంటే… నిరుద్యోగం. ఈ సమస్యను మేము పరిష్కరించలేకపోయాము. యూపీఏ లేదా నేటి ఎన్డీఏ ప్రభుత్వం ఉపాధి గురించి ఈ దేశ యువతకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయాయి “.
“మంచి కంపెనీలు ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నించాయి, కానీ విఫలమయ్యాయి” అని గాంధీ అన్నారు, “… కానీ ఇప్పుడు మనం చైనాకు ఉత్పత్తిని అప్పగించాము …”