కాంగ్రెస్ చేపట్టిన కులగణన కాకి లెక్కలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఓసీలు, ఎస్సీల జనాభా పెరుగుదలతో వ్యత్యాసం ఉందన్నారు. కరీంనగర్‌లో మహాత్మ జ్యోతిబా పూలె విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. బీసీలకు 56.3శాతం రిజర్వేషన్ అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్నారు. ఉద్యమానికి తలొగ్గి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు. కానీ.. బీసీ గణన సరిగా జరగలేదనే మాట ప్రతి చోట వినిపించిందని.. కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే ఒకే రోజు విజయవంతంగా నిర్వహించారన్నారు. బీసీల జనాభా కేవలం 46.2శాతం మాత్రమే ఉన్నదా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ చెప్పినట్లు వెంటనే మైనార్టీలతో కలుపుకొని 56.3 శాతం బీసీలకు వెంటనే రిజర్వేషన్‌లు పెట్టీ మీ చిత్త శుద్ధి నిరూపించుకొండి అని ఆమె వ్యాఖ్యానించారు.