31.2 C
Hyderabad
Monday, February 3, 2025
spot_img

బీజేపీ, కాంగ్రెస్‌ వల్ల తెలంగాణకు తీరని అన్యాయం- హరీశ్‌ రావు

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి చోటు లేదా? అంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు విలువ లేదా? అని అన్నరు. ఇది కేంద్ర బడ్జెట్ లా లేదు, కేవలం మూడు, నాలుగు రాష్ట్రాల బడ్జెట్ లాగా ఉందని ఆరోపించారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఏం సాధించారని నిలదీశారు. తెలంగాణతో తమకు బంధం లేదని బడ్జెట్ ద్వారా మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరూపించిందని అన్నారు

” కేంద్ర జీడీపీకి 5.1శాతం కాంట్రిబ్యూట్ చేస్తున్న తెలంగాణ మరోసారి మోస పోయింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ట్రైబల్ యూనివర్సిటీకి ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వకపోవడం బాధాకరం. తెలంగాణకు నిధులు రాబట్టుకోవడంలో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైంది. తీరిగ్గా తేరుకొని, బడ్జెట్ కు పది రోజుల ముందు రూ.40వేల కోట్లు కావాలని తూతూ మంత్రంగా లేఖ రాయడం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేం లేదు. కేంద్రం బడ్జెట్ ద్వారా నిధులు రాబట్టుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారు.

ఏడాది కాలంలో 30 సార్లకు పైగా ఢిల్లీకి వెళ్లారు. ఏం సాధించారో ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల తీరు వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. నిధుల కేటాయింపు సంగతి దేవుడెరుగు, విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను కూడా కేంద్రం నెరవేర్చలేకపోయింది.

కేంద్రానికి మద్ధతు పలికిన జనతాదళ్ (యూ) బీహార్‌లో వివిధ అభివృద్ధి పనులకు గతేడాది రూ. 26,000 కోట్ల సాయం, 2,400 మెగావాట్ల పవర్ ప్లాంట్, గయాలో పారిశ్రామిక కారిడార్, నూతన విమానాశ్రయాలు, మెడికల్ కాలేజీలకు సాయం తదితరాలు పొందింది. ఎన్నికలు దగ్గర ఉన్నాయని ఇప్పటి బడ్జెట్ లో బిహార్ కు మరిన్ని వరాల జల్లు కురిపించారు. కానీ, నమ్మి 16 సీట్లతో కాంగ్రెస్, బీజేపీలను గెలిపిస్తే, ఇద్దరూ కలిసి తెలంగాణకు మొండి చెయ్యి ఇచ్చారు”.. అని హరీశ్‌ రావు అన్నారు

Latest Articles

ట్రంప్‌ నెక్ట్స్‌ టార్గెట్‌ యూరోపియన్‌ యూనియన్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మెక్సికో, కెనడా, చైనాపై సుంకాల కొరడా ఝళిపించిన తర్వాత మరో కీలక నిర్ణయం ప్రకటించారు. ట్రంప్ ఆదివారం యూరోపియన్ యూనియన్ వస్తువుల దిగుమతులపై సుంకాలను అమలు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్