రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. పిఠాపురం మండలం కుమారపురంలో 12 వేల 500 మినీ గోకులం షెడ్లు పవన్ కల్యాణ్ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. ఆవు బాగుంటేనే రైతు బాగుంటాడు.. రైతు బాగుంటే.. దేశం బాగుంటుందన్నారు. భవిష్యత్తులో 20 వేల గోకులాలు ఏర్పాటు చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. గత ప్రభుత్వం అమూల్‌ను తీసుకొచ్చి.. ప్రభుత్వ డెయిరీలను చంపేసిందని విమర్శించారు. గోకులాల మీద కూడా గత ప్రభుత్వం దృష్టి పెట్టలేద్ననారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 260 గోకులాలు మాత్రమే నిర్మించిందన్నారు. తాము గోవుల సంరక్షణ కోసం 12 వేల 500 గోకులాలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. గత ప్రభుత్వం స్కాముల్లో రికార్డులు సృష్టిస్తే.. కూటమి ప్రభుత్వం పెన్షన్లు పెంపు, అభివృద్దిలో రికార్డు సృష్టించిందని వపన్ అన్నారు.