27.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
spot_img

మానసిక వికాసానికి వ్యాయామం దోహదం..

మానసిక వికాసానికి క్రీడలు దోహదం.. ఇది సర్వామోదిత వాక్కు. అయితే, మానసిక ఉల్లాసంతో పాటు శారీరక రుగ్మతలకు చెక్ పెట్టే మా గొప్ప క్రీడ వ్యాయామ క్రీడ. దైనందిన వ్యాయామం దీర్ఘకాలిక వ్యాధులను మటుమాయం చేస్తుంది. మానసిక ప్రశాంతత కల్గిస్తుంది. ప్రాణాంతక వ్యాధి కరోనా కోరలు చాచినప్పడు.. పెద్ద పెద్ద డాక్టర్లు ఇచ్చిన చిన్న చిన్న సలహాలు ఏమిటి..? వంటింట్లో పోపుల పెట్టి, సమీపంలోని వ్యాయామశాల. ఈ రెంటికి దగ్గరవుతే, కరోనా మహమ్మారికి ఖచ్చితంగా దూరం అవ్వవచ్చని ధన్వంతరి వారసులు నాడు గొంతెత్తి చాటారు. ఇక కోవిడ్ కు ముందు, కోవిడ్ అనంతరం వ్యాయామ సామ్రాజ్య పాత్ర ఏవిధంగా ఉందో చూద్దాం.

బరువు నియంత్రణకు, కండరాల దృఢత్వానికి, ఎముకలు బలవర్థం చేయడానికి, వ్యాధి నిరోధక శక్తి వృద్ది చేయడానికి… ఓహ్.. ఒకటేమిటి ఎన్నో ఉపయోగాలు వ్యాయామం వల్ల కలుగుతాయి. వ్యాయామం వల్ల ఒనగూరే మానసిక శాంతి, యోగాలు, యాగాల వల్ల లభించే శాంతికి సరిసాటని పెద్దలు చెబుతారు. అటు శారీరకంగా, మానసికంగా మానవ ఉన్నతికి ప్రయోజనకారిగా ఉన్న వ్యాయమం చక్కని ఆరోగ్యం కల్గచేస్తుంది. మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది.

ప్రతి నిత్యం క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వ్యక్తిని, అస్సలు వ్యాయామం చేసుకున్న వ్యక్తులను తీసుకుందాం. ఈ ఇరువురికి ఏదో ఆకస్మిక ఘటనలో శరీరానికి గాయం తగిలితే, వ్యాయమం చేసిన వ్యక్తి మానసిక, శారీరక చురుకుదనం వల్ల స్వల్పకాలంలో ఆ గాయం సమసిపోతుంది. వ్యాయామం చేయని వ్యక్తి గాయం మానడానికి దీర్ఘకాలం పడుతుంది. వ్యాయమ విశిష్టతను వివరిస్తూ కొందరు వైద్యులు పలికిన మాటలు ఇవి. వ్యాయామం లోని మెళుకువులు, ఏ వ్యాయామం ఉత్తమమైనది అనే విషయాలు వైద్యులు, వ్యాయామ నిపుణుల నుంచి తెలుసుకోవచ్చు. కొత్త వ్యాయమం ప్రారంభించే ముందు ఏ రకమైన వ్యాయామాలు, కదలికలు ఉత్తమమో వ్యాయామ నిపుణులు తెలియజేస్తారు. గాయం ప్రమాదాన్ని తగ్గించడంతో సహాయపడే వ్యాయామ ప్రణాళికను ఆ వ్యక్తి సూచిస్తారు.

వ్యాయామం అని తలవగానే ఆరోగ్యమస్తు అనే దీవెన వచ్చేస్తుంది. అంతేనా… క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే అనారోగ్యాన్ని దరిచేరకుండా తరిమికొడుతుంది. మనిషి సక్రమ వ్యాయామం వల్ల అక్రమ దండయాత్రలకు పాల్పడే మధుమేహం, అధిక రక్తపోటు, ఉబ్బసం, కీళ్ల నెప్పులు, కాళ్ల నెప్పులు తదితర దీర్ఘకాలిక వ్యాధులకు ఆదిలోనే వ్యాయామం చెక్ పెట్టేస్తుంది. ఆరోగ్యకరమైన బరువు ఉండేలా చేయడంలో వ్యాయమానికి అమోఘమైన పాత్ర అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మనిషైనా, జంతువనైనా, వస్తువైనా, వృక్షమైనా.. ఏదైనా…నిస్తేజంగా ఉంటే నిర్మూలనా దశకు చేరుకుంటుంది. ఏ వ్యాయామం చేయని మనిషిని అనారోగ్యవంతుడుగా ఎలా దర్శనమిస్తాడో, అప్పుడే కొన్న కొత్త వస్తువునైనా ఏళ్ల తరబడి వినియోగించకుండా ఉంటే తుప్పపట్టి పనికి రాకుండా పోతుంది. కొత్త కారో, బైకో కోని మూల పెడితే షెడ్డుకెళ్లి కూర్చుంటుంది. ఎన్ని మైళ్లు పరిగెట్టి వాహనం వ్యాయామంలో నిమగ్నమైతే.. అంత ఆయుష్షు అది కలిగి ఉంటుంది.

వ్యాయామం ఎముక సాంద్రతను మెరుగుపరచడానికి, నిర్వహించడానికి ఎంతో సహాయపడుతుందని పరిశోధనలో తేలింది. ఎంత ఎక్కువ వ్యాయామం చేస్తే అంతలా కండరాలు బలపడతాయి. ఇక కోవిడ్ సమయంలో ఎన్నో ప్రాణాలు నిలబెట్టింది..వంటింటిలోని పోపుల పెట్టి పదార్థాలు, చక్కటి వ్యాయమం అని ఎందరో వైద్యులు తెలిపారు. ఇందులో పసుపు ఎంత గొప్ప పాత్ర వహించిందో అందరికీ తెల్సిందే.

తీవ్రమైన కోవిడ్ 19 సమయంలో అధ్యయనంలో 50 విభిన్న లక్షణాలు గుర్తింపబడగా, రోగులు సగటున 14 లక్షణాలు నివేదించారు. అలసట, ఆందోళన, తిమ్మిరి, నిస్సత్తువ, నిరాసక్తత, నిస్పృహ, తలతిరగడం తదితర ఎన్నో అవలక్షణాలకు మానసిక, శారీరక వ్యాయామాలు మంచి ఫలితాలు ఇచ్చినట్టు తేటతెల్లం అయ్యాయి. వ్యాయామం వల్ల రీ ఇన్ ఫెక్షన్ కు తావు లేకుండా పోయిందని వెల్లడైంది.

రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చాలా మంచిదే, అయితే, కోవిడ్ సోకి తగ్గిన వ్యక్తులు నెమ్మదిగా ఈ ప్రక్రియ ప్రారంభించాలని, ప్రతి వారం వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించుకోవాలని వైద్య ప్రముఖులు చెప్పారు. అలసట కల్గినప్పుడు విశ్రాంతి తప్పక తీసుకోవాలని తెలిపారు. ఇతరులతో పోల్చుకుని ఏ మానసిక రుగ్మతలు కొనితెచ్చుకోవద్దని, స్వీయ నిర్ణయాలు, స్వంత వేగంతో, మానసిక ప్రశాంతతో వ్యాయమ ప్రక్రియ సాగించి సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని నాడు వైద్యశిఖామణులు బోధించారు. ఆ పద్దతుల్లో వెళ్లిన ఎందరో కోవిడ్ రోగులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు.

 

Latest Articles

ఢిల్లీ ఎన్నికల్లో విజేతలెవరు..? పరాజితులు ఎవరు..? ఎగ్జిట్ పోల్స్ స్పెక్యులేషన్ ఇదే

ఉన్నవాళ్లు మళ్లీ రావాలని ఆత్రంలో ఉండగా, లేనివాళ్లు గద్దెక్కి పదవుల్లో రాణించాలని తాపత్రయపడుతున్నారు. అధికార పార్టీ ఆత్రాలు, విపక్షాల తాపత్రయాలు ఎక్కడో, ఎందుకో.. ఆ పక్షాలు ఎవరో అందరికీ తెలుసు. ఢిల్లీలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్