ఏపీలో మాజీ మంత్రి పేర్నినాని వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. రేషం బియ్యం దందా కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు.. నాని కుటుంబంపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. రికార్డులు సంబంధిత పత్రాలతో పేర్ని నాని, జయసుధ హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే,.. వారు హాజరుకాకపోగా.. కొడుకు కిట్టుతోసహా పేర్ని దంపతులు అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వారిపై పోలీసులు లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. అయితే వారు దేశాన్ని విడిచి వెళ్లారా అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్న పోలీసులు.. ఈ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.