కృష్ణా జిల్లా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు బుల్లెట్లు దొరికిన సంఘటన కలకలం రేపింది. గురువారం గన్నవరం నుంచి ఆర్య అనే ప్యాసింజర్ ఢిల్లీకి వెళ్తుండగా బుల్లెట్లు పట్టుబడినట్లు సీఐ బీవీ శివప్రసాద్ తెలిపారు. కేఎల్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ బీటెక్ సెంకడియర్ చదువుతున్నాడని సీఐ చెప్పారు. హర్యానాకు చెందిన ఆర్య జులైలో చదువు నిమిత్తం తన తండ్రి బ్యాగు తీసుకొచ్చినట్లు చెప్పానన్నారు. హర్యానాలో తన తండ్రి బ్యాంకు సెక్యూరిటీ సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నారని చెప్పారన్నారు. తన తండ్రి లైసెన్స్ గన్ బుల్లెట్లు బ్యాగులో ఉన్నట్లుగా ఆర్య చెప్పారన్నారు. ఆర్య మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ చెప్పారు.