కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలైన.. ఎన్నికల్లో హామీలేవీ నెరవేర్చలేదని మండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖపట్నంలో బొత్స మీడియాతో మాట్లాడారు. ఎన్నికల హామీలకు బడ్జెట్‌లో కేటాయించిన నిధులకు పొంతన లేదని తెలిపారు. హామీలు నెరవేర్చకపోగా ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపారని ఆరోపించారు. ప్రజలపై మొత్తం రూ.15 వేల కోట్ల భారం మోపారని మండిపడ్డారు. అప్పుల భారం పెంచుతున్నారని వైసీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారన్న బొత్స… కూటమి ప్రభుత్వం అప్పులెందుకు చేస్తోందని ప్రశ్నించారు.