పీసీబీ నివేదిక రాగానే విశాఖలో కాలుష్యంపై చర్యలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ తెలిపారు. విశాఖ తీరంలో వాయు కాలుష్యంపై శాసన మండలిలో పలువురు సభ్యుల ప్రశ్నలకు పవన్ సమాధానం ఇచ్చారు. విశాఖ తీరంలో వాయు కాలుష్య స్థాయి 7 రెట్లు పెరిగిందని తెలిపారు. పర్యావరణ క్షీణత, కాలుష్య ప్రభావం తగ్గించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కాలుష్య తీవ్రత, నివారణపై పీసీబీ అధ్యయనం చేస్తోందని చెప్పారు. 2025 జనవరి నాటికి పీసీబీ అధ్యయన నివేదిక వస్తుందని తెలిపారు. నివేదిక రాగానే విశాఖలో కాలుష్య నివారణకు చర్యలు చేపడతామని పవన్ కల్యాణ్ చెప్పారు.