సీఎం రేవంత్ రెడ్డి నేడు వేములవాడలో పర్యటించనున్నారు. ముందుగా రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని, అనంతరం రూ.127 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం చుట్టనున్నారు. సీఎం పర్యటనకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రోడ్డు వెడల్పు పనులకు శ్రీకారం చుడుతున్నారు. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని రూ.127 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి వేములవాడలో పర్యటిస్తున్నారు. అందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యక్ష పర్యవేక్షణలో సీఎం పర్యటనను సక్సెస్ చేసే పనిలో పార్టీ శ్రేణులు నిమగ్నమయ్యారు. మంత్రులతో కలిసి సీఎం వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని రూ.127 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. సిరిసిల్ల ఎస్పీ కార్యాలయాన్ని వర్చువల్ గా ప్రారంభిస్తారు. జిల్లాకు వస్తున్న సీఎం వరాల జల్లు కురిపిస్తారని వేములవాడకు మహార్దశ రానున్నదని స్థానిక నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.