సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన కేసులో సినీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మను పోలీసులు విచారించనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో వర్మ విచారణ జరగనుంది. కేసు విచారణకు హాజరుకావాలంటూ ఆర్జీవీకి మద్దిపాడు పోలీసులు ఇటీవల నోటీసులు జారీ చేసారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు రాంగోపాల్ వర్మ మార్ఫింగ్ చేశాడని మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.
మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఎక్స్ లో పోస్టు చేశాడని టీడీపీ మండల కార్యదర్శి రామలింగం మద్దిపాడు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈనెల 10న ఏడు సెక్షన్లతో రాంగోపాల్ వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తనపై నమోదైన కేసు కొట్టేయాలని వర్మ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మని ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారించనున్నారు పోలీసులు.