18.7 C
Hyderabad
Saturday, December 28, 2024
spot_img

ప్రధాని మోదీ రష్యా పర్యటన ఖరారు

భారత ప్రధాని మోదీ రష్యా పర్యటన ఖరారైంది. మాస్కో అధ్యక్షతన వచ్చే వారంలో జరగనున్న బ్రిక్స్‌ సదస్సులో మోదీ పాల్గోనున్నారు. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. రష్యాలోని కజన్‌ వేదికగా ఈ నెల 22 నుంచి 24 వరకు 16వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు హాజరవ్వాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ స్వయంగా మోదీని ఆహ్వానించారు. అందులో భాగంగానే ఈనెల 22 నుంచి 23 వరకు మోదీ రష్యాలో పర్యటించనున్నారని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ సందర్భంగా బ్రిక్స్‌ సభ్య దేశాల అధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారని వెల్లడించింది. ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ హాజరవుతారని ఆ దేశ విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి హువా చున్యింగ్‌ తెలిపారు.

Latest Articles

‘డ్రీమ్ క్యాచర్’ సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటుంది: డైరెక్టర్ సందీప్ కాకుల

ప్రశాంత్ కృష్ణ, అనీషా ధామ, శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య హోలక్కల్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘డ్రీమ్ క్యాచర్’. ఈ చిత్రాన్ని సీయెల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై దర్శకుడు సందీప్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్