తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు విడుదల చేయకపోతే… ఆమరణ దీక్షకు దిగుతానన్నారు మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య. ప్రభుత్వ హామీతో ప్రైవేటు కాలేజీ అసోసియేషన్లు బంద్‌ను విరమించుకునేందుకు ఒప్పుకున్నాయన్నారు. ఈ అంశంపైనే తనను కలిసిన ప్రైవేటు కాలేజీ అసోసియేషన్లను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దగ్గరకు తీసుకెళ్లారు ఆర్ కృష్ణయ్య. ఈ సందర్భంగా మొదటి విడతలో 650 కోట్లు చెల్లించాలంటూ ఉప ముఖ్యమంత్రిని కోరాయి ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీ యాజమాన్యాలు. సర్కారు నుంచి నిధులు విడుదల కాకపోవడం వల్లే కాలేజీలను నడపలేక బంద్ పాటిస్తున్నట్లు వెల్లడించారు. చివరకు ప్రభుత్వ హామీతో బంద్ విరమించిన యాజమాన్యాలు ఈనెల 18 నుంచి యథావిధిగా ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీలు నడుస్తాయని తెలిపారు.


