సీఎం చంద్రబాబు నిజ స్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపిందని అన్నారు వైసీపీ అధినేత జగన్. రాజకీయ దుర్బుద్దితో మత విశ్వాసాలను ఎలా రెచ్చగొట్టారో సుప్రీంకోర్టు అర్థం చేసుకుందని అన్నారు. పొలిటికల్ డ్రామాలు చేయవద్దని సుప్రీంకోర్టు చెప్పిందని… జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారు చేసినట్టుగా చంద్రబాబు అసత్య ప్రచారం చేశారని విమర్శించారు. ఈ విషయంలో చంద్రబాబుకు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందన్న ఆయన.. తాను స్వయంగా వేసుకున్న సిట్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసిందని స్పష్టంచేశారు. చంద్రబాబుకు దేవుడంటే భక్తి ఉంటే.. ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.