హైడ్రా పేరుతో ప్రభుత్వం నిరుపేదల ఇళ్లను కూల్చితే ఊరుకోబోమని మాజీ మంత్రి హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మహా నగరంలో చెరువుల సంరక్షణ పేరుతో హైడ్రా విధ్వంసం సృష్టిస్తుందని ఆరోపించారు. అన్ని అనుమతులు ఉన్నప్పటికీ కక్షపూరితంగా ప్రభుత్వం నిరుపేదల ఇళ్లను బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్నారని మండిపడ్డారు. పేదల ఇళ్లను కూల్చితే బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదని వార్నింగ్ ఇచ్చారు.