అభివృద్ధి పనుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. సనత్ నగర్‌లోని KLN పార్క్‌ను ఆయన పరిశీలించారు. గతంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అనేక అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. BRS ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పనులు ప్రారంభించలేదన్నారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తుందని మండిపడ్డారు. ESI గ్రేవ్ యార్డ్ అభివృద్ధి, ఫతే నగర్ ఫ్లై ఓవర్ విస్తరణ వంటి పనులకు కోట్లాది రూపాయలను తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిందని గుర్తు చేశారు. మంజూరైన అభివృద్ధి పనులు చేపట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోస్తామని తలసాని తెలిపారు.


