రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్టిఎల్ కింద చెరువులు, నాలాలపై అక్రమ నిర్మాణాలు చేపట్టిన కట్టడాలపై చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. కరీంనగర్‌లోని స్పోర్ట్స్ పాఠశాలలో ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో హైడ్రాను ప్రతి జిల్లాలో అమలు చేసేందుకు ప్రభుత్వము చర్యలు చేపడుతుందన్నారు. ప్రభుత్వ చెరువులు, భూములపై అక్రమ కట్టడాలు చేపడితే ఎంతటి వారిపైన అయినా చర్యలు తీసుకునేందుకు ఉపేక్షించమన్నారు. ప్రభుత్వ భూములను కాపాడేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. కరీంనగర్ స్పోర్ట్స్ పాఠశాలలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. క్రీడా పాఠశాలకు ప్రభుత్వం నుంచి 25 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.