కూటమి పాలనతో ఏపీలో గ్రామీణాభివృద్ధి చిగురులు తొడుగుతోందని పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మండలంలోని నందిగామలో జరిగిన గ్రామసభలో కన్నా పాల్గొని మాట్లాడారు. సీఎం చంద్రబాబు గ్రామీణ స్వరాజ్యానికి పెద్దపీట వేశారన్నారు. జీవం కోల్పోయిన పంచాయతీ వ్యవస్థకు చంద్రబాబు ఊపిరి ఊది బతికిస్తున్నారని చెప్పారు. జగన్ ఐదేళ్ల పాలనలో చీకట్లో మగ్గిన గ్రామాలు ఇప్పుడు వెలుగులతో నిండబోతున్నాయని కన్నా అన్నారు. పంచాయతీలకు చెందాల్సిన 13వేల కోట్ల రూపాయలను జగన్ తన సొంత ఖాతాకు మళ్లించుకుని గ్రామాలకు ద్రోహం చేశారని ఆయన విమర్శించారు. పంచాయతీల నిధులు దోచుకున్న జగన్ గ్రామీణులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.