24.2 C
Hyderabad
Wednesday, January 15, 2025
spot_img

నాగార్జున ఎన్ కన్వెన్షన్.. వదిలేస్తారా..? కూలుస్తారా..?

అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా ఝళిపిస్తుంది. దీంతో చెరువులు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మాణాలు చేసిన ప్రముఖుల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇదే సమయంలో హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్ సెంటర్‌ తెరపైకి వచ్చింది. ఇది అక్రమ నిర్మాణమా అన్న చర్చ సాగుతోంది. ఎఫ్‌టీఎల్‌ పరిధిలోనే ఈ నిర్మాణం ఉందంటూ ఇప్పటికే పలువురు ఫిర్యాదులు చేశారు.

తమ్మడికుంట చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్‌ కన్వెన్షన్ నిర్మాణం చేశారంటూ జనం కోసం అనే సంస్థ అధ్యక్షులు కసిరెడ్డి భాస్కర్‌ రెడ్డి హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇప్పటికే కేటీఆర్‌కు చెందిన జన్వాడ ఫామ్‌హౌస్‌పై దృష్టి సారించిన హైడ్రా.. తదుపరి చర్యలు తీసుకోబోయేది ఎన్‌ కన్వెన్షనేనా అన్న చర్చ సాగుతోంది.

ఒకప్పుడు హైదరాబాద్ నగరం చెరువులతో నిండి ఉండేది. కానీ సిటీ అభివృద్ధి పేరుతో నగరంలోని అనేక చెరువులు కబ్జాలకు గురయ్యాయి. దీంతో 1979 నుంచి 2023 వరకు అంటే 44 ఏళ్ళలో నగర పరిధిలోని చెరువుల స్థితిపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఓ నివేదిక రూపొందించింది. శాటిలైట్ చిత్రాల ఆధారంగా 56 చెరువులకు సంబంధించి వాస్తవ విస్తీర్ణం.. ప్రస్తుత విస్తీర్ణంతో కూడిన సమాచారాన్ని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాకు అందజేసింది. దీని ఆధారంగా కబ్జాలపై కొరడా ఝలిపించేందుకు హైడ్రా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఎన్‌కన్వెన్షన్‌పై చర్యలు తప్పవని తెలుస్తోంది.

మాదాపూర్ డివిజన్ ఖానామెట్ సర్వే నెంబర్ 36లో తమ్మిడికుంట చెరువు 29 ఎకరాల 24 గుంటల్లో విస్తరించి ఉంది. ఇప్పుడు ఈ చెరువు చుట్టూ కబ్జాలు చోటుచేసుకుంటున్నాయి. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ చాలా వరకు తమ్మిడికుంటలోనే ఉందని చాలాకాలంగా ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వం ఈ నిర్మాణాలను కూలుస్తామని హడావుడి చేసింది. కానీ అంతలోనే ఏం జరిగిందో కానీ వాటి జోలికిపోలేదు. ఇప్పుడు హైడ్రా అక్రమ కట్టడాలపై ఫోకస్ పెట్టిన నేపథ్యంలో నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను గత ప్రభుత్వం మాదిరిగానే వదిలేస్తారా లేదా చెరువులో ఉన్న నిర్మాణాలను కూలుస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్ కన్వెన్షన్ పేరుతో సినీ హీరో నాగార్జున తమ్మిడికుంట చెరువును పెద్ద ఎత్తున ఆక్రమించారని, ఇప్పుటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎన్ కన్వెన్షన్ పై దృష్టి సారించాలన్న డిమాండ్లు సర్వత్రా వినిపిస్తున్నాయి.

Latest Articles

చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట

ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. స్కిల్‌ కేసులో బెయిల్‌ రద్దు చేయాలన్న గత ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసింది. గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఎం బేలా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్