అంతర్జాతీయ సంస్థ బ్రాక్ ప్రతినిధులతో సచివాలయంలో మంత్రి సీతక్క సమావేశమయ్యారు. పలు దేశాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ఈ సంస్థ పని చేస్తోంది. ఇందులో భాగంగానే మారుమూల ప్రాంతాల్లో విద్య, వైద్యం, ఉపాధి కల్పన వంటి రంగాల్లో పనిచేస్తోంది. అయితే,.. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్న సందర్భంగా మంత్రి సీతక్కను కలిసింది బ్రాక్ బృందం. ఇక ఇప్పటికే రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ప్రజల స్థితిగతులను, అమలవుతున్న సంక్షేమ పథకాల తీరును క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన బ్రాక్.. ఈ వివరాలను మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించింది.