కోల్‌కతాలో మహిళా జూనియర్ డాక్టర్‌పై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్యులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కలెక్టర్ మహేష్ కుమార్‌కు వైద్య బృందం వినతిపత్రం ఇచ్చి, నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రం అమలాపురం, పి.గన్నవరం, కొత్తపేట నియోజకవర్గాల్లో డాక్టర్లు విధులు బహిష్కరించి ధర్నా చేశారు. అమలాపురం ప్రధాన కూడళ్ల వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపిన డాక్టర్లు కలెక్టరేట్‌లో కూడా కొనసాగించారు. డాక్టర్లపై జరుగుతున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేయాలంటే వైద్యులు నినాదాలు చేశారు. గన్నవరం మూడు రోడ్ల జంక్షన్ వద్ద డాక్టర్లు ధర్నా నిర్వహించారు. వియ్ వాంట్ జస్టిస్ అంటూ ప్లకార్డుల పట్టుకొని నినదించారు. నిందితులకు ఉరిశిక్ష వేయాలని డాక్టర్లు డిమాండ్ చేశారు.