ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్‌లో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జితో పాటు 8 మంది వైసీపీ కార్పొరేటర్లు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే 12మంది వైసీపీ కార్పొరేటర్లు టిడిపిలో చేరారు. దీంతో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్‌లో టిడిపి బలం పెరిగింది. వైసీపీ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లకు ఒంగోలు టిడిపి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పార్టీ కండువా కప్పి టిడిపిలోకి ఆహ్వానించారు. మరో రెండు రోజుల్లో పదిమంది వైసీపీ కార్పొరేటర్లు టిడిపిలో చేరుతున్నట్టు సమాచారం.