నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్, అటు యూత్‌ను ఆకట్టుకున్న ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అలాగే బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టుకుంటోంది. మూడు రోజుల్లోనే ఈ మూవీ రూ. 6.04 కోట్లు వసూళ్లతో సందడి చేస్తోంది. రోజు రోజుకీ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుండటంతో. కలెక్షన్స్ విషయంలో ఇకపై ఇదే జోరుని కొనసాగిస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
https://x.com/PinkElephant_P/status/1822913615868948765
మంచి పల్లెటూరి వాతావరణంలో స్నేహం, ప్రేమ, కుటుంబంలోని భావోద్వేగాలను ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ మేకర్స్ చేసిన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ ప్రేక్షకులు సినిమాను ఆదరించారని ట్రేడ్ వర్గాలంటున్నాయి. సినీ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు సైతం కమిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని ప్రశంసిస్తున్నారు.